‘భైరవం’ అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ వున్న మంచి యాక్షన్ థ్రిల్లర్. ఆడియన్స్ థ్రిల్ ఫీలౌతారు: డైరెక్టర్ విజయ్ కనకమేడల

'Bhairavam' is a good action thriller with all the commercial elements. Audience will feel the thrill: Director Vijay Kanakamedala

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మనోజ్ మంచు, నారా రోహిత్ హీరోలుగా నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ భైరవం. విజయ్ కనకమేడల దర్శకత్వంలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై కె.కె. రాధామోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని పెన్ స్టూడియోస్ అధినేత డా. జయంతిలాల్ గడా సమర్పిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్స్ గా అదితి శంకర్, ఆనంది, దివ్యా పిళ్ళై నటిస్తున్నారు. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ ఈ సినిమాపై భారీ బజ్ క్రియేట్ చేశాయి. భైరవం ఈ సమ్మర్ బిగ్గెస్ట్ ఎట్రాక్షన్ గా మే 30న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ విజయ్ కనకమేడల విలేకరుల సమావేశంలో సినిమా విశేషాల్ని పంచుకున్నారు. గరుడన్ కథని రిమేక్ చేయడానికి కారణం? ఒరిజినల్ కథకి తెలుగులో తీసుకొచ్చినప్పుడు ఎలాంటి మార్పులు చేశారు? – కథ కమర్షియల్ గా…