బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ మోస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ భైరవం టీజర్, పాటలు, ప్రమోషనల్ కంటెంట్‌కు అద్భుత స్పందనతో, పాజిటివ్ బజ్‌తో ముందుకు దూసుకెల్తుతోంది. విజయ్ కనకమేడల దర్శకత్వంలో, శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ భారీ నిర్మించారు. పెన్ స్టూడియోస్ డాక్టర్ జయంతీలాల్ గడా సమర్పిస్తున్నారు. ఈ సినిమా మే 30న సమ్మర్ సీజన్‌లో బిగ్గెస్ట్ రిలీజ్ కి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. ఈ సినిమాకి దర్శకుడిగా విజయ్ గారిని ఎంచుకోవడానికి కారణం? -నాకు కమర్షియల్ హీరోగా మంచి పేరు వచ్చింది. తర్వాత కొన్ని స్టైలిష్ సినిమాలు చేయడం జరిగింది. అప్పుడు మాస్ కనెక్ట్ అవుతున్నారా లేదా అనే ఆలోచన ఉండేది. అందరూ రిలేట్…