నందమూరి అభిమానులకు బిగ్ షాక్ తగిలింది. బుధవారం రీ`రిలీజ్ కావాల్సిన ‘భైరవ ద్వీపం’ పోస్ట్ పోన్ అయింది. మూడు దశాబ్దాల కిందట వచ్చిన ఈ ఆల్‌టైమ్ క్లాసికల్ సినిమాను ముందుగా బుధవారం పెద్ద ఎత్తున రీ`రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. థియేటర్‌ల లిస్ట్‌ను కూడా ప్రకటించారు. అయితే అడ్వాన్స్ బుకింగ్స్ లేకపోవడం వల్ల నిర్వాహకులు రీ`రిలీజ్‌ను పోస్ట్ పోన్ చేశారు. రెండు నెలల తర్వాత నవంబర్‌లో ఈ సినిమాను రీ`రిలీజ్ చేయబోతున్నారు. దాంతో సినిమా రీ`రిలీజ్‌ల కోసం కాచుకొని ఎదురు చూసిన అభిమానులకు నిర్వాహకులు నిరాశను మిగిల్చారు. సింగీతం శ్రీనివాస్ రావు దర్శకత్వం వహించిన ఈ ఫాంటసీ సినిమా అప్పట్లో సృష్టించిన రికార్డులు అంతా ఇంతా కాదు. ఫాంటసీ సినిమాలకు బెంచ్ మార్క్ సెట్ చేసిన సినిమా ఇది. అలాంటి సినిమాను ఇన్నేళ్ల తర్వాత మళ్లీ 4ఐలో…