‘దొంగోడే దొరగాడు’ అంటోన్న ‘బెదురులంక 2012’

'Bedurulanka 2012' called 'Dongode Doragadu'

కార్తికేయ గుమ్మకొండ, ‘డీజే టిల్లు’ ఫేమ్ నేహా శెట్టి జంటగా నటించిన ఎంటర్టైనర్ ‘బెదురులంక 2012’. లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 3గా రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మించారు. సి. యువరాజ్ సమర్పకులు. క్లాక్స్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఆగస్టు 25న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ‘వెన్నెల్లో ఆడపిల్ల…’, ‘సొల్లుడా శివ…’ పాటల్ని ఆల్రెడీ విడుదల చేశారు. ఈ రోజు సినిమాలో మూడో పాట ‘దొంగోడే దొరగాడే’ను విడుదల చేశారు. ”లోకం లోన ఏ చోటైనా అందరొక్కటే.. ఎవడికాడూ ఎర్రి బాగులోడూ.. నిజమిదే.. ఇల్లు వొళ్ళు గుల్లే చేసే బేరం ఇదిగో.. పట్టేసేయ్.. అడిగేటోడు ఎవడూ లేడు, అంతా నీదే లాగేసేయ్.. కొట్టేయి తాళం.. తీసేయి గొళ్ళెం.. దొరికిందంతా దోచేయ్ రా.. పట్టిస్తారు హారతి పళ్లెం.. దర్జాగా ఖాళి చెయ్యండ్రా.. దొంగోడే దొరగాడు.. దొంగోడే…