కనుల పండువగా బి.ఎస్‌. రాములు అమృతోత్సవం

B.S. Amrutsavam of Ram

25 ఏళ్ల తెలంగాణ సాహిత్యంపై విశేష చర్చ 25 కొత్త పుస్తకాలు ఆవిష్కరణ హైదరాబాద్‌ : సామాజిక న్యాయమే రచయిత బి. ఎస్‌. రాములు లక్ష్యం అని, తన రచనలతో ఉపన్యాసాలతో జీవన నైపుణ్య కార్యశాలలు నిర్వహించిన తాత్వికవేత్త అని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ పూర్వ ముఖ్య కార్యదర్శి, కవి డా. ఎ. విద్యాసాగర్‌ అభినందించారు. జన చైతన్య మార్గాన్వేషకుడు బి. ఎస్‌. రాములు గొప్ప సృజనశీలి అని కవితాత్మకంగా ఆయన కొనియాడారు. శుక్రవారం రవీంద్రభారతిలో విశాల సాహిత్య అకాడమీ, సామాజిక తాత్విక విశ్వ విద్యాలయం, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, సాహిత్య అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో రచయిత, తెలంగాణ బిసి కమిషన్‌ తొలి చైర్మన్‌ బి. ఎస్‌. రాములు 75వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. అమృతోత్సవ వేడుకల సందర్భంగా పాతికేళ్ల తెలంగాణ సాహిత్యంపై సదస్సు…