మార్చి 4న విశ్వక్ సేన్ ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ విడుదల

Ashokavanamlo arjuna kalyanam Movie relese march 4th

ఫలక్నుమాదాస్ నుంచి పాగల్ వరకు వైవిధ్యమైన కథా చిత్రాలతో మెప్పిస్తున్న యంగ్ హీరో విశ్వక్ సేన్ కథానాయకుడిగా నటిస్తోన్న తాజా చిత్రం ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’. ప్రముఖ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ సమర్ఫణలో ఎస్వీసీసీ డిజిటల్ బ్యానర్పై బాపినీడు, సుధీర్ ఈదర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మార్చి 4న ఈ చిత్రం విడుదలవుతుంది. మంగళ వారం ఈ సినిమా నుంచి ‘సిన్నవాడా ..’ అనే పాట విడుదలైంది. పెళ్లి చూపులకు వచ్చిన అబ్బాయిలో తెలియని ఓ గందరగోళం, చిన్నపాటి ఆతృత ఉంటాయి. వాటిని గురించి ప్రస్తావించేలా ‘సిన్నవాడా..’ సాంగ్ ఉంది. జానపదంలో సాగేలా పాట ఉండటంతో పాట వింటుంటే డిఫరెంట్గా అనిపిస్తూ ఆకట్టుకుంటోంది. జై క్రిష్ సంగీత సారథ్యం వహిస్తోన్న ఈ చిత్రంలోని సిన్నవాడా పాటకు అనన్య భట్, గౌతమ్ భరద్వాజ్ తమ గొంతుకలతో ఓ కొత్తదనాన్ని అందించారు.…