పిట్టగోడ అనే ప్లాప్ మూవీతో దర్శకుడిగా ఇండస్టీక్రి పరిచయమైన అనుదీప్ .. ఆ తర్వాత ’జాతిరత్నాలు’ సినిమాతో ఓవర్ నైట్ క్రేజీ డైరెక్టర్ గా మారిపోయారు. ఒక్క సారిగా టాక్ ఆఫ్ ది ఇండస్టీ అయ్యారు. ఇదే జోష్ లో కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ తో ’ప్రిన్స్’ అనే ద్విభాషా చిత్రం చేయగా అది బోల్తా కొట్టింది. అయితే దర్శకుడిగా ఆయన తనలోని మరో కొత్త కోణాన్ని బయటపెట్టేందుకు రెడీ అయిపోయారు. నటుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. తన ఫన్నీ కామెడీ మాటలతో, ఇనోసెంట్ ఎక్స్ ప్రెషన్ తో పాపులర్ అయ్యారు అనుదీప్. ముఖ్యంగా ఇంటర్వ్యూల సమయంలో యాంకర్ల ముఖాల్లో ఓ క్వశ్చన్ మార్క్ రెయిజ్ చేయడం, షార్ట్ ఆన్సర్స్ చెప్పడం.. ఇలా రకారకాలుగా సోషల్ విూడియాలో బాగా హైలైట్ అయ్యారు. మంచి క్రేజ్ సంపాదించుకున్నారు.…