ఈ మధ్య కాలంలో తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్ గురించి ప్రధానంగా చర్చ జరుగుతోంది. జాతీయ స్థాయిలో కూడా అనిరుధ్ సంగీతం గురించి చర్చ జరుగుతోంది. షారుఖ్ ఖాన్ తో జవాన్ సినిమా కోసం అనిరుధ్ కలిసి పని చేస్తున్న నేపథ్యంలో ముందు ముందు స్టార్ మ్యూజిక్ కంపోజర్ గా బాలీవుడ్ లోనిలిచే అవకాశాలు ఉన్నాయని అంతా మాట్లాడుకుంటూ ఉన్నారు. జవాన్ సినిమాలోని మొదటి పాటతో అనిరుధ్ హిందీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాడు. మొదటి పాటతో అలరించిన అనిరుధ్ తాజాగా జవాన్ నుండి రెండవ పాటను విడుదల చేయడం జరిగింది. హిందీ ప్రేక్షకులు ఆ పాటను ఎంజాయ్ చేస్తున్నారు. కానీ తెలుగు ప్రేక్షకులు మాత్రం అజ్ఞాతవాసి గురించి మాట్లాడుకుంటున్నారు. అనిరుధ్ ట్యూన్ చేసిన జవాన్ రెండో పాటను వింటూ ఉంటే పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమా గుర్తుకు…