ఇంకా “గగన”విహారం చేస్తున్నట్లుగానే ఉంది!!

And it's like traveling in the "air"!!

“డాకు మహారాజ్”లో పోషించిన పాయల్ పాత్రకు దండిగా ప్రశంసలు అందుకుంటున్న చైల్డ్ ఆర్టిస్ట్ గగన గీతిక “డాకు మహారాజ్ లో నటించే అవకాశం రావడమే ఒక గొప్ప అవకాశం అనుకుంటే… ఆ చిత్రంలో బాలయ్యతో స్క్రీన్ షేర్ చేసుకోవడం, ఆయన ప్రశంసలు అందుకోవడం ఎప్పటికీ మర్చిపోలేనని” అంటోంది బాలనటి గగన గీతిక. “పిట్ట కొంచెం… కూత ఘనం” ఆనే సామెతను గుర్తు చేస్తూ… నాలుగున్నరేళ్ల ప్రాయంలోనే టిక్ టాక్ వీడియోస్ చేస్తూ ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించి… “లాయర్ విశ్వనాధ్” చిత్రంతో బాలనటిగా అరంగేట్రం చేసిన ఈ చిచ్చరపిడుగు..రెండవ మూవీ . “ఆర్.ఆర్.ఆర్, నారప్ప,18 పేజీస్, తెల్లవారితే గురువారం” తదితర చిత్రాలలో హీరోయిన్ల చిన్నప్పటి పాత్రలతో తన ప్రతిభకు మరింత సానబెట్టుకుంది!! “90’s మిడిల్ క్లాస్ బయోపిక్, ది గ్రేట్ ఇండియన్ సూసైడ్, ప్రేమ విమానం” చిత్రాలలోనూ నటించి…