(చిత్రం: అనగనగా ఒక రాజు విడుదల తేదీ : జనవరి 14, 2025, రేటింగ్ : 2.5/5, నటీనటులు : నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి, రావు రమేశ్, తారక్ పొన్నప్ప, చమ్మక్ చంద్ర, అనంత్, రంగస్థలం మహేష్, భద్రం తదితరులు. దర్శకత్వం : మారి, నిర్మాతలు : నాగవంశీ, సాయిసౌజన్య, సంగీతం : మిక్కీ జె. మేయర్, ఛాయాగ్రహణం : జె. యువరాజ్, కూర్పు : కళ్యాణ్ శంకర్, నిర్మాణ సంస్థలు: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సమర్పణ: శ్రీకర స్టూడియోస్). ఈ సంక్రాంతిని నవ్వుల పండుగలా మార్చడానికి ‘అనగనగా ఒక రాజు’ చిత్రంతో థియేటర్లలో అడుగుపెట్టారు స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్ పొలిశెట్టి. మూడు వరుస ఘన విజయాలతో ప్రేక్షకుల హృదయాలలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నవీన్ పొలిశెట్టి కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్…
