సహాన ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్ పై బి.టి.ఆర్ శ్రీనివాస్ నిర్మాణ సారథ్యంలో తారక రామ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం అనగనగా ఆస్ట్రేలియాలో. తాజాగా ఈ చిత్ర ట్రయిలర్ విడుదల అయింది. ఈ సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఎంతో వినుత్నంగా జరిగిన ఈ కార్య్రమంలో రచయిత, దర్శకుడు తారక రామ పాల్గొన్నారు. సినిమా గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. దర్శకుడు తారక రామ మాట్లాడుతూ.. ఈ చిత్ర షూటింగ్ మొత్తం ఆస్ట్రేలియాలోనే చేశామన్నారు. అయితే నటీనటులు, సాంకేతిక నిపుణులు మాత్రం తెలుగు వారే అని వెల్లడించారు. తెలుగు వాడు అయిన తాను ఆస్ట్రేలియాలో ఐటీ జాబ్ చేసుకుంటూ అక్కడే సెటిల్ అయినట్లు చెప్పారు. చిన్నతనం నుంచి సినిమాలపై ఇష్టంతో జాబ్ చేసుకుంటూనే ఫిల్మ్ కోర్స్ లో మాస్టర్స్ చేసినట్లు చెప్పారు. సినిమాపై ఉన్న ఇష్టమే…