మెగా కుటుంబంలో అద్భుత ఘడియలు

Amazing moments in the Mega family

* కవల పిల్లలకు జన్మనిచ్చిన ఉపాసన * గుడ్ న్యూస్ షేర్ చేసిన చిరంజీవి మెగా కుటుంబంలో ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఆ అద్భుత ఘడియలు రానే వచ్చాయి. మెగాస్టార్ చిరంజీవి ఇంట పండగ వాతావరణం నెలకొంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – ఉపాసన దంపతులు మరోసారి తల్లిదండ్రులయ్యారు. ఈ సంతోషకరమైన వార్తను స్వయంగా మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. రామ్ చరణ్‌, ఉపాసన దంపతులకు కవల పిల్లలు పుట్టారు. జనవరి 31 శనివారం రాత్రి అపోలో ఆసుపత్రిలో ఉపాసన ఒక బాబుకి, ఒక పాపకి జన్మనివ్వడంతో మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మెగా ఫ్యామిలీలో సందడి నెలకొంది. మనవడు, మనవరాలు ఇద్దరూ ఒకేసారి తమ జీవితాల్లోకి రావడం పట్ల చిరంజీవి సురేఖ దంపతులు ఎంతో ఉద్వేగానికి…