తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి కృతజ్ఞతలు : జంపాల శ్రీనివాస్

తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి కృతజ్ఞతలు : జంపాల శ్రీనివాస్

తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి బిజెపి రాష్ట్ర నాయకులు జంపాల శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ.. కేంద్ర జాతీయ రహదారులశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ప్రకటించిన నిధులవల్ల రెండు తెలుగు రాష్ట్రాలకు ఎంతో మేలు జరగనుందన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో జాతీయ రహదారుల అభివృద్ధి పనులకు రూ.573.13 కోట్లు విడుదల చేయడం వల్ల ఈ ప్రాజెక్టుల్లో హైదరాబాద్‌-భూపాలపట్నం సెక్షన్‌లో 163వ జాతీయ రహదారి విస్తరణ, నాగర్‌కర్నూల్‌ జిల్లాలో కృష్ణానదిపై ఐకానిక్‌ బ్రిడ్జి అప్రోచ్‌ రోడ్డు, ఎన్‌హెచ్‌-167కేలో లేన్ల అభివృద్ధి పనులు ఉన్నాయన్నారు. నాగర్‌కర్నూల్‌ జిల్లాలో కృష్ణా నదిపై రూ.436.91 కోట్లతో ఐకానిక్‌ బ్రిడ్జి నిర్మించనున్నారని, ఈ రహదారి వల్ల హైదరాబాద్‌ నుంచి తిరుపతి, నంద్యాల, చెన్నైల మధ్య దాదాపు 80 కిలోమీటర్ల…

ప్రపంచంలోనే అత్యుత్తమ రాజ్యాంగం మనది : ఆలేరు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఎం.ఏ ఏజాస్

Aler republicday news

* ఆలేరు ఇందిరా కాంగ్రెస్ భవనం వద్ద ఘనంగా 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ప్రపంచంలోనే అత్యుత్తమ రాజ్యాంగం మనదని, మనకు ఈ రాజ్యాంగాన్ని అందించిన దార్శనికులకు నివాళులర్పిస్తున్నామని ఆలేరు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఎం.ఏ ఏజాస్ పేర్కొన్నారు. 73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు ఇందిరా కాంగ్రెస్ భవనం వద్ద ఆలేరు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఎం.ఏ ఏజాస్ జాతీయ జెండాను ఆవిష్కరించి తెలంగాణ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందజేశారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జెండాను ఎగురవేసిన అనంతరం ఏజాస్ మాట్లాడుతూ.. గణతంత్ర దినోత్సవ స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. కీలక చట్టాలు తెచ్చి దేశాన్ని కాంగ్రెస్ శక్తివంతంగా తీర్చిదిద్దిందని ఆయన తెలిపారు. మోదీ, కేసీఆర్ లాంటి నాయకులు ప్రజలను పట్టి పీడిస్తున్నారన్నారు. కేంద్రం ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రాల హక్కులు…