(టాలీవుడ్ టైమ్స్ ప్రతినిధి – ఆలేరు ) పాలనలో స్వార్దం లేకుండా నిజాయితీ గా పరిపాలన కొనసాగిస్తే దేశ ప్రజలు అంతే విధంగా బాగుంటారని బిజెపి మహబూబ్‌నగర్ జిల్లా ఇంచార్జి ప్రేమ్ రాజ్ యాదవ్ అన్నారు. ఆలేరు పట్టణంలో రెండు రోజుల బిజెపి రాజకీయ శిక్షణా తరగతుల ముగింపు కార్యక్రమానికి మంగళవారం హాజరైన ఆయన మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ప్రధాని మోడీ దేశంలోని అన్ని రాష్ట్రాలకు సమానంగా నిధులను కేటాయిస్తూ నిజాయితీ పాలనకు నిదర్శనంగా నిలుస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోఅనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు కోసం కేంద్రం భారీగా నిధులు కేటాయిస్తున్నా కేసీఆర్ ప్రభుత్వం పధకాలకు తమ సొంత పేరు పెట్టుకొని ప్రజలకు అందిస్తుందని చెప్పారు.మోడీ ప్రభుత్వం ఏమీ చేయడం లేదని అబద్ధాలు చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు.తెలంగాణ లోని…