అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్ వివాహం శుక్రవారం ఉదయం జరిగింది. అఖిల్ తన ప్రేయసి జైనాబ్ రావ్జీ మెడలో మూడు ముళ్ళు వేశారు. నాగార్జున ఇంట్లో హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం జరిగింది. తదుపరి కొత్త జంట ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు నాగార్జున. ”మా ఇంటిలో ఉదయం 3:35 గంటల ముహూర్తంలో జైనాబ్ రావ్జీతో మా అబ్బాయి అఖిల్ వివాహం జరిగింది. ఈ విషయాన్ని మీతో పంచుకోవడానికి నేను, అమల ఎంతో సంతోషిస్తున్నాం. మా హృదయాలు ఆనందంతో నిండిపోయాయి. ప్రేమ, ఆప్యాయత, నవ్వులు వెల్లివెరిసిన క్షణాలలో, మాకు దగ్గరైన బంధు మిత్రుల సమక్షంలో ఒక కల నిజం కావడాన్ని మేము చూశాం. ఇవాల్టి నుంచి జీవితంలో నూతన ప్రయాణం ప్రారంభించిన కొత్త జంట ఆశీర్వదించమని కోరుతున్నాం. మీ ప్రేమ, అభిమానం వారిపై ఎప్పుడు ఉండాలి”…