ఏజెంట్’ ఇంటెన్స్ యాక్షన్ డ్రామా.. చాలా వైల్డ్ గా వుంటుంది : అఖిల్ అక్కినేని

Akhil Akkineni interview about agent telugu movie

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని, స్టైలిష్ మేకర్ సురేందర్ రెడ్డిల క్రేజీ స్టైలిష్ స్పై యాక్షన్ ఎంటర్ టైనర్ ‘ఏజెంట్’ ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ఏజెంట్ ప్రమోషనల్ ట్రెమండస్ రెస్పాన్స్ తో భారీ అంచనాలని పెంచింది. ఏప్రిల్ 28న ఏజెంట్ ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో హీరో అఖిల్ అక్కినేని చిత్ర విశేషాలని మీడియా సమావేశంలో పంచుకున్నారు. ఏజెంట్ జర్నీ ఎలా మొదలైయింది? నాకు లార్జర్ దేన్ లైఫ్, యాక్షన్ సినిమాలు అంటే చాలా ఇష్టం. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చేస్తున్నప్పుడు ఎక్కడో చిన్న వెలితి. ఆ సినిమా చాలా మంచి విజయం సాధించింది. నాకు యాక్సెప్టెన్స్ చాలా వరకు పెరిగింది.…