ఐన్ స్టీన్ మరియు ల్యాండ్ సినిమాస్ బ్యానర్ పై ఏ. కె.సజన్ దర్శకత్వంలో జోజు జార్జి, ఐశ్వర్య రాజేష్ హీరో హీరోయిన్లుగా నటుస్తున్న సినిమా పులిమేద. తాజాగా విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్ కు మంచి స్పందన లభించింది. తాజాగా చిత్ర యూనిట్ ట్రైలర్ ను విడుదల చేసింది. ఇటీవల ఇరట్ట సినిమాతో మంచి విజయం సాధించిన జోజు జార్జి పులిమేద సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం విశేషం. తెలుగు ప్రేక్షకులకు సూపరిచితమైన ఐశ్వర్య రాజేష్ ఈ సినిమాలో మరో మంచి రోల్ ప్లే చేస్తోంది. ఐన్ స్టీన్ మీడియా గతంలో జోజు జార్జి తో డైరెక్టర్ జోషి దర్శకత్వంలో అంథోని సినిమా చేశారు, పులిమేద వారి కాంబినేషన్ లో రెండో సినిమా. ఈ సినిమాకు ఇషాన్ దేవ్ సంగీతం అందించారు అలాగే రఫీక్…