యంగ్ హీరో సోహైల్, రూపా కొడవయూర్ హీరో హీరోయిన్లుగా మైక్ మూవీస్ బ్యానర్ మీద అప్పి రెడ్డి, రవి రెడ్డి సజ్జల, వెంకట్ అన్నపరెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘మిస్టర్ ప్రెగ్నెంట్’. ఈ సినిమాను దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి రూపొందిస్తున్నారు. ఈ నెల 18న ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను కింగ్ నాగార్జున విడుదల చేశారు. ఈ సందర్భంగా… నిర్మాత రవిరెడ్డి సజ్జల మాట్లాడుతూ – మా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా వచ్చిన కింగ్ నాగార్జున గారికి థాంక్స్ చెబుతున్నాం. కొత్త వాళ్లను ఎంకరేజ్ చేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డైరెక్టర్ ఆర్జీవీ మొదలు..ఇప్పటిదాకా ఎంతోమంది న్యూ టాలెంట్ ను పరిచయం చేసిన ఘనత నాగార్జున గారికే దక్కుతుంది. ఆ మంచితనమే ఆయన ఛార్మింగ్ లుక్స్…