రామాయణ ఇతిహాస నేపథ్యంతో ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆదిపురుష్ టీజర్ ఇటీవల విడుదలై రికార్డులు తిరగరాస్తుండగా, తాజాగా మీడియా కోసం ఏఎంబి థియేటర్లో వేసిన స్పెషల్ షో అందరినీ అబ్బురపరచింది. ఈ సందర్భంగా హీరో ప్రభాస్ మాట్లాడుతూ, “మొదటిసారి మా టీజర్ ని 3D లో చూస్తూ చిన్నపిల్లాడిలా ఫీల్ అయ్యాను. అభిమానులకోసం 60 థియేటర్లలో 3D టీజర్ వేస్తున్నాం. ఇది థియేటర్ కోసం తీసిన సినిమా. మీ అందరి అభిమానం, ఆశీస్సులు మాకు కావాలి . రానున్న 10 రోజుల్లో మరింత మంచి కంటెంట్ తో మీ ముందుకి వస్తున్నాం.” అన్నారు. దర్శకుడు ఓం ఓం రౌత్ మాట్లాడుతూ, ” 3D లో టీజర్ మీ అందరికి నచ్చిందనుకుంటున్నాను. దిల్ రాజు గారు ఇక్కడకి వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు” అన్నారు. నిర్మాత…