మెగా ఫోన్ పట్టుకోబోతున్న నటి సంజన అన్నే !!!

Actress Sanjana Anne is going to hold a mega phone!!!

అప్పుడెప్పుడో భానుమతి.. ఆ తర్వాత సావిత్రి , ఆపై విజయ నిర్మల.. ఆ తర్వాత బి జయ.. ఇలా తరానికి ఒక్క లేడీ డైరెక్టర్ కనిపిస్తుంటారు. ఏ ఇండస్ట్రీలో అయినా అంతే. కానీ ఇప్పుడు ట్రెండ్ మారుతుంది. ఇప్పుడు లేడీ డైరెక్టర్స్ చాలా మంది వస్తున్నారు. మెగా ఫోన్ పట్టి తమ సత్తా చూపిస్తున్నారు. తెలుగు ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో కొందరు లేడీ డైరెక్టర్స్ వచ్చి సత్తా చూపించారు. విజయాలు కూడా అందుకున్నారు. అలా మొదలైది, కల్యాణ వైభోగమే, ఓ బేబీ సినిమాలను డైరెక్ట్ చేసి నందిని రెడ్డి మంచి దర్శకురాలు అనిపించుకున్నారు. అలాగే 2021 యేడాదిలో ‘వరుడు కావలెను’ సినిమాతో లక్ష్మీ సౌజన్య… ఆ తర్వాత విడుదలైన ‘పెళ్లి సందD’ సినిమాతో గౌరీ డైరెక్టర్స్ పని చేసారు. తాజాగా పలు సినిమాల్లో హీరోయిన్ గా…