నటి పావలా శ్యామలను కాపాడుకుందాం..! ▪️ దయనీయ జీవితం గడుపుతున్న నటి పావలా శ్యామల ▪️ ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలతో సతమతం ▪️ దినదిన గండంగా బతుకీడుస్తున్న సీనియర్ నటీ ▪️ ఆపన్నహస్త కోసం ఎదురుచూస్తున్న శ్యామల ▪️ ఆత్మహత్యే దిక్కు అంటున్న నటి పావలా శ్యామల ▪️ వయోభారంతో మంచానికే పరిమితమైన శ్యామల రంగురంగుల ప్రపంచంలో ఓ వెలుగు వెలిగిన ఆ తార జీవితాన్ని చీకట్లు కమ్మేశాయి. వెండితెరపై నవ్వుల వాన కురిపించిన ఆ నటి ఇప్పుడు నిస్సాహయస్థితిలోకి వెళ్లిపోయింది. తనను కాపాడంటూ ఆ కళామాతల్లి ముద్దుబిడ్డ ఇప్పుడు చేతులెత్తి ఆర్థిస్తోంది. దయనీయ జీవితం గడుపుతున్న నటి పావలా శ్యామల నిజజీవిత కథ ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది. కంటతడి పెట్టిస్తోంది. పావలా శ్యామల… ఆ పేరు తలుచుకోగానే ఆమె విలక్షణమైన హాస్య నటన గుర్తుకు…