‘ప్రేమ దేశం’ అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే చిత్రం : మధుబాల

Actress madhubala Interview

త్రిగున్, మేఘా ఆకాష్ హీరో హీరోయిన్లుగా శ్రీకాంత్ సిద్ధం దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ప్రేమ దేశం’. ‘శ్రీ క్రియేటివ్ వర్క్స్’ బ్యానర్ పై శిరీష సిద్ధం ఈ చిత్రాన్ని  నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. మణిశర్మ సంగీతంలో రూపొందిన పాటలకు కూడా మంచి మార్కులు పడ్డాయి. డిసెంబర్ 2న ఈ మూవీ గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రంలో ప్రాముఖ్యమైన పాత్రలో కనిపించనున్న అలనాటి హీరోయిన్ మధుబాల మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే… – నేను ఇది వరకు చాలా వరకు తల్లి పాత్రలు పోషించాను. ఇప్పుడు హీరోయిన్‌గా చేయలేను కాబట్టి తల్లి పాత్రలు వస్తాయి. ఈ పాత్రను నా కోసమే రాశానని దర్శకుడు అన్నారు. నేను ముందు నో చెప్పాను. కానీ పదే…