సినీ నటుడు విజయ రంగరాజు గుండెపోటుకు గురై చెన్నై ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ (సోమవారం) ఉదయం కనుమూశారు. భైరవ ద్వీపం సినిమాలో విలన్ గా సినీ రంగ ప్రవేశం చేసి వందలాది చిత్రాల్లో నటించారు. యజ్ఞం సినిమా అతనికి మంచి పేరు తెచ్చిపెట్టింది. పూనె కు చెందిన విజయ రంగరాజు సినిమా అవకాశాల కోసం వచ్చి చెన్నై లో స్థిరపడ్డారు. పెద్దగా సంపాదించింది లేదు. అందుకే కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ఆయన అసలు పేరు ఉదయ్ రాజ్ కుమార్. ఎస్వి రంగారావు లా పేరు తెచ్చుకుంటారనే ఉద్దేశ్యం తో బాపు గారు అతని పేరును విజయ రంగరాజుగా మార్చారు. తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కుల తీవ్రత పెరిగిందని బాహాటంగా విమర్శించి పలు బ్యానర్స్ కు దూరమై ఆర్ధిక ఇబ్బందులు పడిన…