అమెరికాలో ఘనంగా ‘ఆటాడిన పాట’ టైటిల్ విడుదల

‘Aataadina Paata’ Title Launched Grandly in the USA

నక్షత్రం ప్రొడక్షన్ బ్యానర్‌పై ప్రముఖ రచయిత వేణు నక్షత్రం దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘ఆటాడిన పాట’. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ లాంచ్ కార్యక్రమం అమెరికాలోని వర్జీనియా రాష్ట్రం, స్టెర్లింగ్ సిటీలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో అమెరికన్ తెలుగు అసోసియేషన్ అధ్యక్షుడు జయంత్ చల్లా తన సతీమణి కవిత చల్లాతో కలిసి టైటిల్‌ను అధికారికంగా లాంచ్ చేయగా, టాలీవుడ్ నిర్మాత, ప్రముఖ న్యాయవాది నాగేశ్వర్ రావు పూజారి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ వేడుకకు పెద్ద సంఖ్యలో ఎన్నారైలు హాజరై, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. దర్శకుడు వేణు నక్షత్రం మాట్లాడుతూ…ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసి, తమ సన్నిహిత మాటలతో మాకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చిన జయంత్ చల్లా గారికి, అలాగే నాగేశ్వర్ రావు పూజారి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. డీసీ…