లాంఛనంగా ప్రారంభమైన AA క్రియేషన్స్, RK సినిమా బ్యానర్స్ ప్రొడక్షన్ నెం.1 చిత్రం

RK Cinema, AA Creations Banners Production No. 1 project launched traditionally

వైవిధ్యమైన చిత్రాలను రూపొందిస్తూ న్యూ టాలెంట్‌ను ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో AA క్రియేషన్స్, RK సినిమా బ్యానర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ లాంఛనంగా ప్రారంభమైంది. పూజా కార్యక్రమాల్లో చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. సూర్య ప్రకాష్ వేద దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రానికి ఓవర్‌సీస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ AA సినిమాస్ అధినేత ఫణి ముత్యాల , రఘు కుంచే నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. జగన్ చావలి సినిమాటోగ్రఫీ అందించనున్న ఈ చిత్రానికి రఘు కుంచే సంగీతాన్ని అందిస్తున్నారు. జనవరి నుంచి షూటింగ్‌ను స్టార్ట్ చేసి ఏకధాటిగా చిత్రీకరణను జరపాలని ప్లాన్ చేసినట్లు మేకర్స్ తెలిపారు. సినిమాలో నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే తెలియజేస్తామని చిత్ర యూనిట్ సభ్యులు పేర్కొన్నారు.