* దుశ్శల పాత్రలో జీవించిన అలేఖ్య పుంజాల అభినయ తపస్వి డాక్టర్ అలేఖ్య పుంజాల మరోసారి తన నట విశ్వ సౌరభాన్ని చాటుకున్నారు. గాంధారి కుమార్తెగా, వంద మంది కౌరవులకు చెల్లెలు అయిన దుశ్శల పాత్రలో జీవించి రాణించి మెప్పించారు. బుధవారం రవీంద్రభారతిలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో, త్రిష్ణ కూచిపూడి డాన్స్ అకాడమి, సూత్రధార్ యాక్టింగ్ ట్రైనింగ్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో తెలంగాణ సంగీత నాటక అకాడమి అధ్యక్షురాలు ప్రొఫెసర్ డాక్టర్ అలేఖ్య పుంజాల దుశ్శల ఏకపాత్రాభినయం ప్రదర్శించారు. 70 నిముషాలు పాటు నాన్ స్టాప్ అభినయ వాచకంతో ఆమె విశేషంగా ఆకట్టుకున్నారు. కూచిపూడి నాట్య గురువుగా నర్తకీమణి గా విభిన్న పాత్రలతో ప్రయోగాలు చేస్తూ తనదైన గుర్తింపు పొందిన అలేఖ్య పుంజాల ప్రత్యేక దుశ్శల పాత్రలో మంచి నటీమణి అని నిరూపించుకున్నారు. అనాదిగా…
