టాలీవుడ్ కు అవార్డుల పంట

A crop of awards for Tollywood

తెలుగు సినిమాకు ఏడు అవార్డులు ఉత్తమ తెలుగు చిత్రంగా ‘భగవంత్ కేసరి’ ‘బేబీ’, ‘హను-మ్యాన్’ చిత్రాలకు రెండేసి అవార్డులు ‘బలగం’తో గీతరచయిత కాసర్ల శ్యామ్ కు జాతీయ అవార్డు ‘గాంధీ తాత చెట్టు’తో ఉత్తమ బాలనటిగా సుకృతివేణి 2023 సంవత్సరానికి సంబంధించిన 71వ జాతీయ చలన చిత్ర అవార్డులను ప్రకటించారు. ఈ అవార్డు జ్యూరీ కమిటీ శుక్రవారం నాడు కేంద్ర సమాచారం, ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు నివేదికను అందజేసింది. మొత్తం 15 విభాగాల్లో అవార్డులను జ్యూరీ ఈ సందర్భంగా ప్రకటించింది. జాతీయ ఉత్తమ చిత్రంగా 12th ఫెయిల్‌కు అవార్డు దక్కింది. జాతీయ ఉత్తమ నటుడి అవార్డును ఇద్దరు నటులు పంచుకున్నారు. షారుక్ ఖాన్(జవాన్), విక్రాంత్ మస్సే(12th ఫెయిల్‌) ఎంపికయ్యారు. మిస్సెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే (హిందీ)లో నటనకు గాను రాణీ ముఖర్జీని ఉత్తమ నటి…