# సరికొత్త మాస్ అండ్ యాక్షన్ అవతార్‌లో నందమూరి కళ్యాణ్ రామ్ డిఫరెంట్ మూవీస్, రోల్స్ చేస్తూ హీరోగా తనదైన వెర్సటాలిటీతో మెప్పిస్తోన్న స్టార్ నందమూరి కళ్యాణ్ రామ్. ఆయన లేటెస్ట్ మూవీ ‘డెవిల్’. ‘ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్’ ట్యాగ్ లైన్. దేవాన్ష్ నామా సమర్పణలో అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై నవీన్ మేడారం దర్శకత్వంలో అభిషేక్ నామా ఈ పీరియాడిక్ డ్రామాను నిర్మిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ఫైనల్ స్టేజ్‌కు చేరుకుంది. ప్రస్తుతం ఈ సినిమా క్లైమాక్స్‌ను చిత్రీకరిస్తున్నారు. 500 మందితో ఈ ఫైట్‌ను తెరకెక్కిస్తుండటం విశేషం. టాలీవుడ్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్షన్ ఎపిసోడ్‌గా చెప్పుకునేలా దీన్ని ఫైట్ మాస్టర్ వెంకట్ ఆధ్వర్యంలో డిజైన్ చేశారు. ఈ సందర్భంగా నిర్మాత అభిషేక్ నామా మాట్లాడుతూ ‘‘మా బ్యానర్‌పై ఎంతో ప్రెస్టీజియస్‌గా డెవిల్ సినిమాను…