ఇటీవల కశ్మిర్లో జరిగిన ఉగ్రదాడి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పాకిస్తాన్ ఉగ్రవాదులు చేత కానీ వారిలాగా అమాయకులపై విరుచుకుపడ్డారు. దీంతో దేశ వ్యాప్తంగా ఈ ఘటనపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి భారతీయుడి రక్తం మరిగిపోతుంది. పాకిస్తాన్ ఉగ్రవాదులను కట్టడి చెయ్యాలంటూ దేశావ్యాప్తంగా నిరసనలు మొదలయ్యాయి. ఇప్పటికే అధికారులు ఉగ్రవాదులను కట్టడి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. భారత సైనికులు రంగంలో దిగారు. ఉగ్రవాదుల వేట మొదలు పెట్టారు. ఇక పోతే కశ్మిర్ ఉగ్రదాడిలో చనిపోయిన వారికి ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో నివాళి జరిగింది. ఈ క్రమంలో MAA మాజీ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ అండ్ సీనియర్ నటుడు మురళి మోహన్ గారు మాట్లాడుతూ.. ఈ ఉగ్రదాడి చాలా దురదృష్టకరమైన పరిణామం అన్నారు. ప్రశాంతకరమైన భారతదేశంలో ఇలాంటి దాడులు జరగడం చాలా బాధాకరం అన్నారు. ఈ దాడికి…