డైరెక్టర్ వి.వి. వినాయక్ ఆవిష్కరించిన ‘14 డేస్ లవ్’ మూవీ మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్

14 days love telugu movie

అఖిల్ అండ్ నిఖిల్ సమర్పణలో సుప్రియ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగరాజ్ బోడెమ్ దర్శకత్వంలో హరిబాబు. డి నిర్మిస్తోన్న చిత్రం ‘14 డేస్ లవ్’. మనోజ్ పుట్టుర్, చాందిని భగవానిని హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్ర మోషన్ పోస్టర్‌ మరియు ఫస్ట్ లుక్‌ని తాజాగా సంచలన దర్శకుడు వి. వి. వినాయక్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘ఈ మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్ చాలా బాగుంది, మంచి ప్రేమకథని ప్రేక్షకులకు చెప్పబోతున్నట్లుగా తెలుస్తోంది. దర్శకుడు నాగరాజ్ బోడెమ్‌కు, నిర్మాత హరిబాబుకి ఈ చిత్రం మంచి సక్సెస్‌ని ఇవ్వాలని కోరుతూ.. టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్’’ అని అన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు నాగరాజ్ బోడెమ్ మాట్లాడుతూ.. ‘‘దర్శకుడు వినాయక్‌గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందరికో ఆయన స్పూర్తిగా నిలుస్తున్నారు. మా టీమ్‌ని ఆశీర్వదించి, సినిమా సక్సెస్ కావాలని…