‘100 డేస్ లవ్ స్టోరీ’ ట్రైలర్ విడుదల

'100 Days Love Story' trailer released

శ్రీ సాయి శివ ప్రియ క్రియేషన్స్ పతాకంపై పురిపండ .వి. వెంకటరమణ మూర్తి శర్మ నిర్మాతగా.. విజయమిత్ర దర్శకత్వంలో ‘100 డేస్ లవ్ స్టోరీ’అనే చిత్రం రూపుదిద్దుకుంటోంది. ‘అతి ప్రేమ భయానకం’ అనేది క్యాప్షన్. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ శుక్రవారం ప్రసాద్ ల్యాబ్ లో నిర్మాత సాయి వెంకట్ చేతుల మీదుగా ఘనంగా జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ‘100 డేస్ లవ్ స్టోరీ’ చిత్రం ట్రైలర్ అత్యంత అద్భుతంగా ఉంది. ట్రైలర్ ని చూస్తే చక్కటి ప్రేమకథలా అనిపిస్తుంది. ఈ చిత్రానికి క్యాప్షన్ గా ‘అతి ప్రేమ భయానకం’ని పెట్టడంలోనే సినిమా ఎలా ఉండబోతోందో అంచనా వేయొచ్చు అన్నారు. ప్రస్తుతం ప్రేమ పేరుతో సమాజంలో ఎన్నో మోసాలు జరుగుతున్నాయి. యువత ప్రేమ మోజులో జీవితాలను కోలోతున్నారు. ఈ విషయంలో ఎంతో జాగ్రత్తగా…