‘హను-మాన్‌’ వండర్ ఫుల్ విజువల్ ట్రీట్ : డైరెక్టర్ ప్రశాంత్ వర్మ

director prashanthvarma interview about HANUMAAN Movie

క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న తొలి చిత్రం ‘హను-మాన్‌’. టాలెంటెడ్ హీరో తేజ సజ్జా కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని శ్రీమతి చైతన్య సమర్పణలో ప్రైమ్‌షో ఎంటర్‌ టైన్‌మెంట్‌ పై కె నిరంజన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ భారీ అంచనాలు పెంచాయి. ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో దర్శకుడు ప్రశాంత్ వర్మ మీడియాతో చిత్ర విశేషాలని పంచుకున్నారు. ‘హను-మాన్‌’ రిలీజ్ డేట్ ఎప్పుడు ? వీఎఫ్ఎక్స్ పనులు జరుగుతున్నాయి. జూన్ చివరికి పూర్తవుతాయని ప్రామిస్ చేశారు. చివర్లో చూసి క్వాలిటీ పరంగా రెడీ అనుకున్నప్పుడు జూలై ఫస్ట్ వీక్ లో రిలీజ్ డేట్ అనౌన్స్ చేద్దామని భావిస్తున్నాం. వీఎఫ్ఎక్స్ వర్క్ మన చేతిలో ఉండదు. ఒకొక్క షాట్ రెండర్ అవ్వడానికి చాలా…