ఏఎమ్ఎఫ్, కోన సినిమా బ్యానర్లపై అనిల్ మోదుగ, శివ కోన సంయుక్తంగా నిర్మిస్తున్న తాజా చిత్రం “రాజు గారి కోడిపులావ్” కుటుంబ కథా ‘వి’చిత్రం అనేది ట్యాగ్. ఈ సినిమాకు శివ కోన దర్శకత్వం వహిస్తున్నారు. రాజుగారి కోడిపులావ్ చిత్రం నుంచి విడుదలైన పాటలు, వీడియోలు మూవీ లవర్స్ అందరి దృష్టిని విపరీతంగా ఆకట్టుకొన్నాయి. ‘రాజు గారి కోడిపులావ్’ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ ముగించుకుని జూలై 29న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలకు ముస్తాబు అవుతున్న సందర్భంగా అందరూ ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్న భారీ అప్డేట్ ట్రైలర్ రూపంలో మన ముందుకు వచ్చింది. ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో చేతిలో చికెన్ ముక్క పట్టుకొని ఓ పాప అడవిలో ఎంట్రీతో ట్రైలర్ మొదలవుతుంది. రాజు గారి కోడి పులావ్…