దిల్ ఖుష్ పాట నా కెరీర్ లో గుర్తుండిపోతుంది : హీరో ఆశిష్ యంగ్ హీరో ఆశిష్, నూతన దర్శకుడు కాశీ విశాల్ దర్శకత్వంలో సుకుమార్ రైటింగ్స్ తో కలిసి ప్రముఖ నిర్మాత దిల్ రాజు, శిరీష్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న యూత్‌ఫుల్ మాస్ ఎంటర్‌టైనర్ ‘సెల్ఫిష్’తో వస్తున్నారు. పోస్టర్లలో ఆశిష్ మాస్ క్యారెక్టర్, నిర్లక్ష్య వైఖరిని మనం ఇప్పటివరకు చూశాం. ఈ రోజు, మేకర్స్ ఫస్ట్ సింగిల్ ను లాంచ్ చేశారు. ఇది హీరో పాత్ర తాలుకా మరొక కోణం చూపుతుంది. ఇది సెల్ఫిష్ దిల్ కా ఫస్ట్ బీట్. దిల్ ఖుష్ పాటలో కథానాయిక పాత్ర పోషించిన ఇవానాని ఆరాధించే కథానాయకుడి ఆనందాన్ని ప్రజెంట్ చేస్తుంది. ఈ పాటను తెలుగు, హిందీ పదాల అందమైన అల్లికతో సరస్వతీపుత్ర రామజోగయ్య శాస్త్రి రాశారు.…