‘సామజవరగమన’ నాన్ స్టాప్ గా నవ్విస్తూనే వుంటుంది : హీరో శ్రీవిష్ణు & టీమ్

‘సామజవరగమన’ నాన్ స్టాప్ గా నవ్విస్తూనే వుంటుంది : హీరో శ్రీవిష్ణు & టీమ్

శ్రీవిష్ణు కథానాయకుడిగా వివాహ భోజనంబు ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందుతున్నకంప్లీట్ ఎంటర్‌టైనర్ ‘సామజవరగమన’. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిల్ సుంకర సగర్వంగా సమర్పిస్తునారు. ఈ సినిమాలో శ్రీవిష్ణు సరసన రెబా మోనికా జాన్ హీరోయిన్‌గా నటిస్తోంది. సరదాగా సాగే ఈ సినిమా టీజర్‌ను మేకర్స్ ఈరోజు విడుదల చేశారు. చిన్న విషయాలుకు కూడా చిరాకుపడే యువకుడిగా కనిపించాడు శ్రీవిష్ణు. కాలేజీ రోజుల్లో ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ ఆమె అతనికి రాఖీ కడుతుంది. అప్పటి నుంచి అమ్మాయిలు తనకు ప్రపోజ్ చేసినప్పుడల్లా రాఖీ కట్టించుకుంటాడు. ప్రేమ పై నెగిటివ్ అభిప్రాయాన్ని పెంచుకుంటాడు. శ్రీవిష్ణు కామిక్ టైమింగ్ అద్భుతంగా ఉంది. అతని డైలాగ్స్, ఫ్రస్టేషన్ ఫ్రెష్ నెస్ ని తీసుకొచ్చాయి. బాత్రూమ్ సీక్వెన్స్, ఫోన్ కాల్‌…