సత్య దేవ్ ‘గరుడ చాప్టర్-1’ ఫస్ట్ లుక్ విడుదల

Satya Dev, Kranthi Bala, Abhishek Nama, Shri Abhishek Pictures’ Garuda Chapter-1 First Look Unleashed

యంగ్ హీరో సత్య దేవ్ విభిన్నమైన జోనర్‌ సినిమాలతో ఆకట్టుకుంటున్నారు. ఇప్పుడు భారీ సెటప్‌ తో కూడిన యూనిక్ యాక్షన్ థ్రిల్లర్‌ కు సైన్ చేశారు. మంచి అభిరుచి గల చిత్రనిర్మాత అభిషేక్ నామా నిర్మించనున్న ఈ చిత్రానికి కొత్త దర్శకుడు క్రాంతి బాల దర్శకత్వం వహిస్తుండగా , శ్రీ అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌ పై దేవాన్ష్ నామా సమర్పిస్తున్నారు. ఇది డెవిల్ తర్వాత ఈ ప్రొడక్షన్ హౌస్ నుండి వస్తున్న నెక్స్ట్ ప్రాజెక్ట్. ఈరోజు సత్యదేవ్ పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమా టైటిల్‌ ను అనౌన్స్ చేశారు. ఈ చిత్రానికి “గరుడ చాప్టర్-1” అనే స్ట్రయికింగ్ టైటిల్‌ ని లాక్ చేశారు. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ ని కూడా విడుదల చేశారు మేకర్స్. సత్య దేవ్ తన వీపుపై ఒక చిన్న పాపని…