వ్యవసాయం కుటుంబం నుంచి… వెండితెరకు!

వ్యవసాయం కుటుంబం నుంచి... వెండితెరకు !

వెండితెరపై కనిపించాలని చాలా మందికి ఆసక్తి ఉంటుంది. అయితే వాటిని సాకారం చేసుకునే వారు కొందరే ఉంటారు. అలాంటి అరుదైన యువకుల్లో ‘ఊరికి ఉత్తరాన’ ఫేం నరేన్ వనపర్తి. వరంగల్ జిల్లాకి చెందిన ఈ యువకుడు సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించి… ఏదైనా సాధించి మంచి పేరు తెచ్చుకోవాలనే తపనతో ఆస్ట్రేలియాలో ఉన్నత చదువులు చదువుకున్నారు. అక్కడే ఎంఎస్ పూర్తి చేసి… ఓ వైపు ఉద్యోగం చేస్తూనే… మరోవైపు ఏదైనా బిజినెస్ చేయాలనుకున్నాడు. దాంతో ఇండియాకు తిరిగొచ్చి…ఇక్కడ ‘ఈగల్ పిజ్జా’ అనే ఓ ఫాస్ట్ ఫుడ్ ఔట్ లెట్ ను ప్రారంభించి… దానిని ఇప్పుడు సుమారు 25 బ్రాంచిల వరకు విస్తరించారు. అయితే తను చిన్నప్పటి నుంచి మెగాస్టార్ చిరంజీవి సినిమాలను చూస్తూ పెరగడంతో… ఎప్పటి నుంచో వెండితెరపై కనిపించాలనే ఆసక్తి ఉంది. దాంతో ఓ వైపు…