‘విమానం’ నుంచి ‘సిన్నోడా ఓ సిన్నోడా..’ లిరికల్ సాంగ్ ప్రోమో విడుదల

‘విమానం’ నుంచి ‘సిన్నోడా ఓ సిన్నోడా..’ లిరికల్ సాంగ్ ప్రోమో విడుదల

తెలుగు, తమిళ భాషల్లో జూన్ 9 న చిత్రం విడుదల తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోన్న వైవిధ్యమైన చిత్రం ‘విమానం’. విలక్ష‌ణ న‌టుడు స‌ముద్ర ఖ‌ని ఇందులో వీర‌య్య అనే మ‌ధ్య వ‌య‌స్కుడి తండ్రి పాత్ర‌లో న‌టించారు. ప్ర‌తీ తండ్రి త‌న కొడుకుని ఉన్నతంగా చూసుకోవాల‌ని అనుకుంటాడు. విమానం సినిమాలోనూ స‌ముద్ర ఖ‌ని అంగ వైకల్యంతో బాధ‌ప‌డుతున్న‌ప్ప‌టికీ, భార్య లేక‌పోయిన‌ప్పటికో కొడుకుని ప్రేమ‌గా పెంచుకుంటాడు. అలాంటి తండ్రీ కొడుకుల మ‌ధ్య ప్రేమానుబంధాన్ని గొప్ప‌గా ఆవిష్క‌రించేలా రూపొందిన పాట ‘సిన్నోడా ఓ సిన్నోడా..’. ఈ లిరికల్ సాంగ్ మే 2న రిలీజ్ కానుంది. అయితే సదరు పాటలోని ఎమోషన్స్ ఎలా ఉంటాయో చూపించేలా సాంగ్ ప్రోమోను చిత్ర యూనిట్ ఆది వారం విడుదల చేసింది. చిత్ర సంగీత దర్శకుడు చరణ్ అర్జున్ పాటను రాయటం విశేషం. ప్రముఖ సింగర్…