విడుదలకు సిద్దమైన ‘ఐక్యూ’ (పవర్ ఆఫ్ స్టూడెంట్స్)

విడుదలకు సిద్దమైన 'ఐక్యూ' (పవర్ ఆఫ్ స్టూడెంట్స్)

కాయగూరల రాజేశ్వరి సమర్పణలో కె. యల్. పి మూవీస్ పతాకంపై సాయి చరణ్, పల్లవి, ట్రాన్సీ నటీ నటులుగా జి. యల్. బి. శ్రీనివాస్ దర్శకత్వంలో కాయగూరల లక్ష్మీ పతి నిర్మించిన చిత్రం “ఐక్యూ” (పవర్ అఫ్ స్టూడెంట్స్).అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్దమైన సందర్బంగా చిత్ర యూనిట్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన నటుడు సుమన్, ప్రతాని రామకృష్ణ గౌడ్, పాండుగొడ్, సేతు మాధవ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం.. నటుడు సుమన్ మాట్లాడుతూ.. చాలా కొత్త పాయింట్ ను సెలెక్ట్ చేసుకొని తీసిన ఈ సినిమా ప్రేక్షకులకు చాలా డిఫరెంట్ గా ఉంటుంది. జి. యల్. బి. శ్రీనివాస్ చక్కటి దర్శకత్వం వహించారు. సురేందర్ రెడ్డి మంచి సినిమాటోగ్రఫీ అందించారు. ఘటికాచలంకు వయసు పెరిగిన…