విజయ్ దేవరకొండ # VD12 రెగ్యులర్ షూటింగ్ మొదలు

విజయ్ దేవరకొండ # VD12 రెగ్యులర్ షూటింగ్ మొదలు

విజయ్ దేవరకొండ 12వ సినిమా మొదటి షెడ్యూల్ ఈరోజు మొదలయ్యింది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వస్తున్న ఈ పీరియాడికల్ డ్రామాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తోంది ఈ చిత్రాన్ని. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో వస్తున్న ఈ సినిమా ఈరోజు సారథి స్టూడియోస్ లో రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యింది. అవార్డ్ విన్నింగ్ స్పోర్ట్స్ డ్రామా జెర్సీతో మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకున్న దర్శకుడు గౌతమ్ తిన్ననూరి, రౌడీ బాయ్ ది విజయ్ దేవరకొండ తో చేస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై అంచనాలు పెరిగాయి. తెలుగు చిత్రసీమలో మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్లలో ఒకరైన శ్రీలీల కథానాయిక గా ప్రకటించడంతో ఈ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ మరింత పెరిగాయి. భారతదేశంలోని అగ్రశ్రేణి సంగీత దర్శకులలో ఒకరైన అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకి…