ఎన్నో సక్సెస్‌ఫుల్ చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించి హిట్ చిత్రాల నిర్మాతగా తనదైన గుర్తింపును పొందిన వ్యక్తి దిల్ రాజు. ఆయన ఇప్పుడు మరో వైవిధ్యమైన సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించటానికి సిద్ధమయ్యారు.. ఆ చిత్రమే ‘వాలాట్టి’. సాధారణంగా మనుషులు సాహసాలు చేయటాన్ని చూసుంటాం. వాటి ఆధారంగా రూపొందిన సినిమాలను చూసుంటాం. కానీ.. తొలిసారి కొన్ని పెంపుడు కుక్కులన్నీ కలిసి ఓ సాహసాన్ని చేస్తే ఎలా ఉంటుంది?.. అదొక అద్భుతమనే చెప్పాలి. అలాంటి హృదయానికి హత్తుకునే కథతో రూపొందిన సినిమానే ‘వాలాట్టి’. రోషన్ మాథ్యు, శోభు షాహిర్, ఇంద్రన్స్, సన్నీ వానే, సజ్జు కురుప్ తదితరులు ఇందులోని పెంపుడు కుక్కల పాత్రలకు వాయిస్ ఓవర్‌ను అందించారు. భారతీయ సినిమా చరిత్రలో తొలిసారి కుక్కలు, ఇతర పెంపుడు జంతువులు ఉన్న సినిమాలో మనుషులు భాగం అయ్యారని చెప్పాలి. లవ్,…