ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ ప్రియాంక తుంపాల టాలీవుడ్ లో మంచి అవకాశాలతో దూసుకుపోతున్నారు. తన కార్పొరేట్ వృత్తిని కొనసాగిస్తూనే ఆమె డబ్బింగ్ కెరీర్ ని కూడా కంటిన్యూ చేస్తున్నారు.16 ఏళ్ల కెరీర్ లో 2008 నుంచి ఇప్పటి వరకు ప్రియాంక తుంపాల 150 పైగా చిత్రాలకు డబ్బింగ్ అందించారు. ఆమె తన మొదటి చిత్రం విలేజ్ లో వినాయకుడు చిత్రంలో శరణ్య మోహన్ కి డబ్బింగ్ చెప్పి గుర్తింపు పొందారు. అప్పటి నుంచి వరుసగా ప్రియాంకకి అవకాశాలు వస్తున్నాయి. డబ్బింగ్ లో ఆమె ఎంతో ప్రతిభ కలిగిన వాయిస్ ఆర్టిస్ట్ అని చెప్పొచ్చు. ప్రతి నటీమణికి ప్రియాంక వారికి సెట్ అయ్యే విధంగా వైవిధ్యం చూపిస్తూ డబ్బింగ్ చెప్పగలదు. ఒక నటికి మరొక నటికీ పోలిక లేకుండా వారి బాడీ లాంగ్వేజ్ కు అనుగుణంగా వాయిస్ ఇవ్వడం…