తిరువీర్, రూపక్ రోనాల్డ్‌సన్, వాల్తేర్‌ ప్రొడక్షన్స్ పరేషన్ థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేసిన రానా దగ్గుబాటి

తిరువీర్, రూపక్ రోనాల్డ్‌సన్, వాల్తేర్‌ ప్రొడక్షన్స్ పరేషన్ థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేసిన రానా దగ్గుబాటి

పరేషాన్‌ ప్రివ్యూ చూసాక నాకూ నవ్వి నవ్వి.. దవడలు నొప్పి పెట్టాయి : హీరో రానా దగ్గుబాటి రిపీట్‌గా చూసే లా పరేషాన్‌ ఉంటుంది : తిరువీర్ మసూద విజయంతో దూసుకుపోతున్న యంగ్ హీరో తిరువీర్ పల్లెటూరి సరదా డ్రామా పరేషాన్‌లో అలరించడానికి సిద్ధంగా ఉన్నాడు. వాల్తేర్‌ ప్రొడక్షన్స్‌ పై విశ్వతేజ్‌ రాచకొండ, సిద్దార్థ్‌ రాళ్ళపల్లి నిర్మించారు. రూపక్ రోనాల్డ్‌సన్ దర్శకుడు. ఈ సినిమాను రానా దగ్గుబాటి సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి రానా దగ్గుబాటి సమర్పకుడిగా రావడంతో పెద్ద బ్యాకింగ్ ఉంది. సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా ఈ చిత్రం విడుదల కానుంది. జూన్‌ 2న థియేటర్‌లలో విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ఆదివారంనాడు హైదరాబాద్‌లోని పివిఆర్‌ సినీ మ్యాక్స్‌లో థియేట్రికల్ ట్రైలర్‌ను రానా దగ్గుబాటి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకుడు రూపక్ రోనాల్డ్‌సన్, సంగీత…