క్రికెటర్ కావాలని కలలు కంటూ ఆ రంగంలో రాణిస్తున్న ఆ కుర్రాడు… కారణాంతరాల వల్ల ఆ క్రీడలో తన కల సాకారం అయ్యే అవకాశాలు లేకపోవడంతో… సినిమా రంగంపై దృష్టి సారించాడు. అయితే సినిమా రంగంలో రాజ్యమేలుతున్న వారసత్వాన్ని డీ కొట్టే సాహసం చేయడం ఇష్టం లేక… “చలో ముంబై” అంటూ ప్రతిభకు పట్టాభిషేకం చేస్తున్న అక్కడి టివి రంగంపై గురి పెట్టాడు. తన హైదరాబాద్ హిందీ భాషకు మరింతగా మెరుగులు దిద్దుకుని… తనను తాను సాన బెట్టుకున్నాడు. హిందీ టెలివిజన్ రంగంలో తన పేరు చిన్నగా మారు మ్రోగేలా చేసుకున్నాడు!! హైదరాబాద్ లో పుట్టి పెరిగి… ముంబైలో తన ఉనికిని గట్టిగా నిరూపించుకుని… తెలుగు నిర్మాతల దృష్టిని విశేషంగా ఆకర్షిస్తున్న ఆ తెలుగు కురరాడి పేరు “శ్రవణ్ రెడ్డి”.!! “దోస్తీ యారియా మన్మర్జియాన్”, “థింకిస్తాన్ సీజన్…