యువ నటుడు రాకేష్ వర్రే స్వీయ నిర్మాణంలో ‘పేకమేడలు’

యువ నటుడు రాకేష్ వర్రే తన స్వీయ నిర్మాణంలో 'పేకమేడలు'

‘బాహుబలి’ చిత్రంలో సేతుపతిగా నటించి మెప్పించిన యువ నటుడు రాకేష్ వర్రే తన స్వీయ నిర్మాణంలో క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ పతాకం పై కథానాయకుడిగా చేసిన చిత్రం ‘ఎవ్వరికీ చెప్పొద్దు’. 2019 దసరాకి థియేటర్స్ లో సందడి చెయ్యటమే కాకుండా గత నాలుగు సంవత్సరాల్లో నెట్ ఫ్లిక్స్ లో అత్యధికంగా చూడబడ్డ తెలుగు చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఇప్పుడు అదే క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్ బ్యానర్ మీద రాకేష్ వర్రే కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తూ “పేకమేడలు” అనే నూతన చిత్రాన్ని నిర్మించి విడుదలకు సిద్ధం చేస్తున్నారు. ఈ చిత్రం ద్వారా ‘నా పేరు శివ’,’అందగారం’ వంటి హిట్ చిత్రాల్లో నటించిన వినోద్ కిషన్, నూతన నటి అయిన అనూష కృష్ణ లను తెలుగు తెర కి హీరో హీరోయిన్లుగా పరిచయం అవుతున్నారు. వారితో పాటూ…