‘మేమ్ ఫేమస్’ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. నెగిటివ్ ప్రచారం చేయడం సరికాదు : చిత్ర యూనిట్

'మేమ్ ఫేమస్' కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. నెగిటివ్ ప్రచారం చేయడం సరికాదు : చిత్ర యూనిట్

రైటర్ పద్మభూషణ్ బ్లాక్ బస్టర్ విజయం తర్వాత లహరి ఫిల్మ్స్, చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ కలిసి చేసిన మరో యూత్ ఫుల్ ప్రాజెక్ట్ ‘మేమ్ ఫేమస్’. సుమంత్ ప్రభాస్ దీనికి దర్శకత్వం వహించడంతో పాటు ప్రధాన పాత్ర పోషించారు. మణి ఏగుర్ల, మౌర్య చౌదరి, సార్య, సిరి రాసి ఇతర ప్రముఖ తారాగణం. అనురాగ్ రెడ్డి, శరత్, చంద్రు మనోహరన్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈనెల 26 న విడుదలైన ఈ సినిమా యూత్ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ యూత్ బ్లాక్ బస్టర్ పంచాయతీ ప్రెస్ మీట్ నిర్వహించింది. ప్రెస్ మీట్ లో నిర్మాత శరత్ మాట్లాడుతూ.. మేము చాలా కష్టపడి ఒక సినిమా చేశాం. అది బాగలేకపోతే ఇక్కడ నిలబడం. కావాలనే సినిమాని తొక్కేయాలని కొందరు…