మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఎవైటెడ్ మెగా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘భోళా శంకర్’. స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ ట్రెమండస్ రెస్పాన్స్ తో సందడి చేస్తోంది. రామబ్రహ్మం సుంకర భారీ కాన్వాస్‌లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ రోజు మేకర్స్ మరో బిగ్ అప్డేట్ తో వచ్చారు. భోళా శంకర్ థియేట్రికల్ ట్రైలర్‌ను జూలై 27న విడుదల చేయనున్నారు. మరో 4 రోజుల్లో మెగా పండగ ప్రారంభం కానుంది. ఇప్పటికే టీజర్, పాటలతో మేకర్స్ కావాల్సినంత వినోదాన్ని అందించారు. ఇప్పుడు బిగ్ ఎంటర్ టైమెంట్ రాబోతోంది. పోస్టర్‌లో చిరంజీవి చేతిలో కత్తి పట్టుకుని ఫెరోషియస్ గా కనిపించారు. తమన్నా భాటియా, కీర్తి సురేష్, సుశాంత్ ఈ సినిమాలో ఇతర ముఖ్య తారాగణం. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్న…