చిత్రపురి అధ్యక్షులు అనిల్ కుమార్ వల్లభనేని ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన చిత్రపురి బోనాల వేడుకలు భక్తులను అమితంగా ఆకట్టుకుని విశేషంగా అలరించాయి. చిత్రపురి అధ్యక్షులు అనిల్ కుమార్ వల్లభనేని, కౌన్సిలర్ హైమాంజలి దంపతులు అమ్మవారికి తొలి బోనాలు సమర్పించారు. భక్తులు చిత్రపురి శ్రీశ్రీశ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని భక్తి శ్రద్దలతో దర్శించుకున్నారు. ఈ అమ్మవారు చాలా శక్తివంతమైన అమ్మవారు అని చిత్రపురి వాసులు, భక్తులు ఎంతగానో కొలుస్తారు. చిత్రపురి కాలనీలో మొట్టమొదటిసారి LIG & EWS, HIG, MIG, Row House, HIG Duplex నుండి బోనాలు అమ్మవారికి సమర్పించుకోవడం జరిగినది. ఎన్నో సంవత్సరాలు ఇంటి కల నెరవేరినందుకు ఇక్కడ నివసిస్తున్న చిత్రపురి వాసులందరూ సుమారు 4000 కుటుంబాలు కలిసి పెద్ద ఎత్తున సంబరాలు చేయడం ఒక మహా జాతరను తలపించినది. ఇక్కడ అమ్మవారి బోనాలు ఇంత పెద్ద…