ప్రస్తుతం ఆడియన్స్ కి భాషతో సంబంధం లేకుండా ఒక మంచి సినిమా ఏ భాషలో ఉన్న కూడా చూడటం అలవాటు అయిపోయింది. రీసెంట్ టైమ్స్ లో క్రిస్టి, ఇరట్ట, రోమాంచం వంటి మలయాళం సినిమాలు రిలీజై ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. రీసెంట్ గా మే 5 న విడుదలైన మలయాళం సినిమా “2018”. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ టాక్ తో ముందుకు సాగుతూ బీభత్సమైన కలక్షన్స్ ను రాబడుతుంది. ఈ సినిమా మొదటి రోజు రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్స్ కేవలం రూ.1.85 కోట్లు మాత్రమే. కానీ అనూహ్యంగా ఈ సినిమా కేవలం మౌత్ టాక్ తోనే పదిరోజుల్లో వంద కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. “2018” ఆగస్టు నెలలో ఋతుపవనాల కారణంగా కురిసిన అధిక వర్షాలు వలన, కేరళలో 2018 లో అధిక వరదలు…