మెగాస్టార్ చిరంజీవి ఇదివరకే తన మెగా యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘భోళా శంకర్’ లోని ఒక పాట చిత్రీకరణ నుంచి వీడియోను లీక్ చేశారు. ప్రధాన తారాగణంతో కూడిన జామ్ జామ్ జజ్జనక అనే పాట ఇటీవల విడుదలై అద్భుతమైన స్పందనను అందుకుంది. స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రామబ్రహ్మం సుంకర అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. తాజాగా చిరంజీవి మరో వీడియో లీక్ చేశారు. ఈ వీడియో అభిమానులు, ప్రేక్షకులకు బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చారు చిరంజీవి. ‘‘మా కళ్యాణ్ బాబు తన సినిమాల్లో అప్పుడప్పుడూ నా ప్రస్తావన తీసుకురావడం, నా పాటలకి స్టెప్పులేయడం, నా డైలాగులను ఇమిటేట్ చేసి మిమ్మల్ని ఎంతగానో ఎంటర్ టైనర్ చేస్తుంటారు. అదే విధంగా నేను మిమ్మల్ని ఎంటర్ టైన్ చేయడానికి ‘భోళాశంకర్’లో తన…